Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య కన్నుమూత.. పుట్టినరోజునే..

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (11:04 IST)
mannava balayya
సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య (92) శ‌నివారం క‌న్నుమూశారు. తెలుగు చిత్ర సీమలో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్న బాలయ్య శనివారం కన్నుమూశారు. పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం బాధాకరం.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్ గూడ‌లో తుది శ్వాస విడిచారు 
 
ఎత్తుకు పై ఎత్తు చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య 300కు పై చిత్రాల్లో పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. 1930లో మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు. 
 
ఆయన తండ్రి మన్నవ గురవయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. ఇద్దరూ సాహిత్యాభిలాషులు. చదువంటే ప్రాణం. అందువల్ల తమ అబ్బాయిని బాగా చదివించాలని తపించారు. 
 
అదే రీతిన బాలయ్య కూడా ఆ రోజుల్లోనే బి.ఇ. చదివారు. మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు బాలయ్య. సినీ రంగంలో అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేశారు.
 
కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అమృత ఫిలింస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి అందులో శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం, కృష్ణ హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నేరము - శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, అలాగే చిరంజీవితో ఊరికిచ్చిన మాట వంటి సినిమాలను నిర్మించారు. అలాగే దర్శకుడిగానూ పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రూ.99కే క్వార్టర్ మద్యం బాటిల్...

ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల.. పోస్ట్‌కార్డ్ ప్రచారం

బాల్య వివాహాల అడ్డుకట్టకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో మహిళా అఘోరి పూజలు (video)

10వ తరగతి బాలికకు 24 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. గర్భవతి అయి వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments