Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో కాంతారావు కుమారుడు... సాయం కోసం ఎదురు చూపు!!

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు సీనియర్ నటుడు కాంతారావు. ఎన్నో వందల చిత్రాల్లో నటించారు. గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇపుడు ఆయన కుమారుడు రాజా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమ కుటుంబం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉందని, అద్దె ఇంట్లో జీవిస్తున్నామని తెలిపారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలోని రవీంధ్ర భారతిలో జరిగిన కాంతారావు శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ, నా తండ్రి శతజయంతి వేడుకల్లో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ ఆయన చిత్రాల్లో నిర్మించారు. దీంతో తాము ఆర్థికంగా చాలా నష్టపోయాం. 
 
ఆయన కేన్సర్ బారినపడినపుడు చికిత్స నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం తాను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నగర శివారుల్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నాం. పరిశ్రమ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి మాకు ఓ ఇల్లు కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments