బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో బాల నటుడిగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సీనియర్ నటుడు గరిమెళ్ల విశ్వేశ్వరరావు నిన్న చెన్నైలో మరణించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడుగా ఆయనకు మా సంతాపాన్ని ప్రకటించింది.
కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు చిన్నతనంలో తన తండ్రి హరికథలు చెప్పడంతో ఆయనకు ఆసక్తి ఏర్పడింది. పొట్టిగా వుండడంతోపాటు మాటలు బాగా మాట్లాడడంతో పాటు హాస్యం వచ్చేలా యాక్షన్ కూడా చేయడంతో అప్పట్లో ఎస్.వి. రంగారావు, ఎ.ఎన్.ఆర్. లు షూటింగ్ లో ఆయనతో సరదాగా గడిపేవారు. పద్మనాభం సినిమా పొట్టి ప్లీడర్ లో బాల నటుడిగా చిన్న వేషం వేశారు. అలా కొన్ని సినిమాలు చేయడంతో ఆయన చదువు అటకెక్కింది. అలా బాల బారతం వంటి సినిమాలలో శ్రీదేవి పక్కన నటించారు.
అలా పెద్దయ్యాక షూటింగ్ గ్యాప్ లో చదువుతూ ఎం.ఎస్.సి. పూర్తిచేశారు. ఇక ఆ తర్వాత షూటింగ్ లు లేకపోవడంతో ఫార్మాస్యూటిక్ కంపెనీలో రిప్లరెంటేటివ్ గా చేరి విజయవాడ, బెంగుళూరు, చెన్నైతిరుగుతుండేవారు. అలా చెన్నై వెల్ళి మరలా సినిమా వేషాలు వేస్తూ తనకంటూ శైలిని రూపొందించుకున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో నిన్న మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మా లోని ఆయన సన్నిహితులు కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.