Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా నగ్న వీడియోలు చూసే ముందు.. అద్దం ముందు నిల్చొని నిన్ను నీవు చూసుకో : రిపోర్టర్‌కు రాధికా ఆప్టే (వీడియో)

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (13:40 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న నటి రాధికా ఆప్టే. తనకు అడ్డగోలు ప్రశ్న వేసిన ఓ రిపోర్టర్‌ను దుమ్ముదులిపివేసింది. నా నగ్న క్లిప్పింగ్స్ చూసే ముందుగా అద్దం ముందు నిల్చొని నిన్ను నీవు చూసుకో అంటూ సూటిగా చెప్పింది. దీంతో ఆ రిపోర్టర్ ఖంగుతినాల్సి వచ్చింది. 
 
నిజానికి ఈ అమ్మడు తరచూవార్తల్లో నిలుస్తోంది. ఆమె వ్యక్తిగత సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో హాట్ టాపిక్‌కు తెరలేపింది. తాజాగా 'పర్చేడ్' సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఈ సీన్‌ సినిమా రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది. అయితే పలువురు రాధికా ఆప్టే వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మరీ ఇంత బరితెగింపా అంటూ చీత్కరించుకున్నారు. ఎవరెన్ననుకున్నా తన పంథాలో ముందుకు సాగిపోతోంది. 
 
తాజాగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాధికా ఆప్టే పాల్గొంది. అదిల్ హుస్సేన్, రాధికా ఆప్టే మధ్య చిత్రీకరించిన శృంగార సన్నివేశంపై ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎందుకిలాంటి సన్నివేశాల్లో నటిస్తారంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రాధికా ఆప్టే కోపంతో ఊగిపోతూ సమాధానమిచ్చింది. 
 
అంతలోనే తేరుకుని మీరడిగిన ప్రశ్న హాస్యాస్పదంగా ఉందని రాధికా నవ్వేసింది. వివాదాలనేవి మీలాంటి వారు సృష్టిస్తారని... ఆ క్లిప్‌ను మీరు చూస్తారు. మీ పక్కనున్న వాళ్లకు షేర్ చేస్తారు. మళ్లీ మీరే కాంట్రవర్సీ సృష్టిస్తారు అని రాధికా చెప్పింది. తానొక ఆర్టిస్ట్‌నని... తన పాత్రకు తగిన న్యాయం చేసేందుకు ఎంతటి కఠిన స్థితినైనా ఎదుర్కొంటానని ఆమె తెలిపింది. 
 
తాను ఏ విషయంలోనూ సిగ్గుపడనని, చాలామంది ఎదుటి వారి శరీరాన్ని చూడటానికి ఉత్సుకత చూపిస్తారని, తమ శరీరం కూడా అలాంటిదేనని చెప్పుకోవడానికి సిగ్గు పడతారని రాధికా చెప్పింది. పర్చేడ్‌లో సన్నివేశాన్ని చూసే ముందు, ఒక్కసారి తమను తాము అద్దంలో నగ్నంగా చూసుకోవాలని... అప్పుడు మీకే అర్థమవుతోందని రాధికా ఆప్టే ఘాటుగా స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడండి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం