Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్లే బ్యాక్'

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:30 IST)
Play back pre release
'100%లవ్', '1 నేనొక్కడినేస‌ చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించిన డైరెక్ట‌ర్‌ హరిప్రసాద్ జక్కా తాజాగా 'ప్లే బ్యాక్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలోనే తొలిసారిగా క్రాస్ టైమ్ కనెక్షన్ అనే వినూత్న పాయింట్తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా అనన్య నాగళ్ల‌ హీరోయిన్గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రసాదరావు పెద్దినేని 'ప్లే బ్యాక్' చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల సుకుమార్ టీజర్ విడుదల చేశారు. మార్చి 5న రిలీజ్కానుంది.
 
ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో సినీ ప్రముఖుల సమక్షంలో వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు పల్నాటి సూర్యప్రతాప్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన‌, వేమారెడ్డి,  సాయి రాజేష్, రమేష్, త్రినాథ్‌, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, హీరోలు దినేష్ తేజ్, అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, తేజస్ కూరపాటి, అవినాష్, బంటి, అభినవ్, హీరోయిన్ అనన్య నాగళ్ల, చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా, నిర్మాత ప్రసాదరావు పెద్దినేని, టీవీ5 మూర్తి, టియన్ఆర్, టి ఆర్ యస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పాల్గొన్నారు. 'ప్లే బ్యాక్' ఫస్ట్ టికెట్ ను బుచ్చిబాబు సాన‌ కొనుగోలు చేశారు.
 
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన‌ మాట్లాడుతూ. రిస్క్ చేసే దగ్గరే రిటర్న్స్ వస్తాయి. 'ప్లే బ్యాక్' హిట్ అవుతుంది. ఆ చిత్రంతో బ్యాక్ అవకుండా హరిప్రసాద్ మరిన్ని చిత్రాలు చేయాలి".అన్నారు.
 
 హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు మంచి సినిమా వస్తే  ఆదరిస్తామని 'హుషారు' సినిమాతో ప్రూవ్ చేశారు. మా టీమ్ అందరం కలిసి 'ప్లే బ్యాక్' లాంటి ఇంట్రెస్టింగ్ నావేల్టీ లవ్ స్టొరీ సినిమా చేశాం. కొత్తగా వచ్చే నాలాంటి వారిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయండి. 200 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తాను. సినిమానే నా జీవితం. 'ప్లే బ్యాక్' చిత్రం అందరికీ నచ్చుతుందని నా గట్టి నమ్మకం అన్నారు.
 
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. "మల్లేశం, హుషారు తర్వాత చేసిన సినిమా 'ప్లే బ్యాక్'. కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ హరిప్రసాద్ఈ సినిమా చేశారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రావడం ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సినిమా అందరికీ నచ్చుతుంది" అన్నారు.
 
చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఇంతవరకూ చూడని సినిమా 'ప్లే బ్యాక్' అని గ్యారెంటీగా చెప్పగలను. సెంటిమెంట్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అన్నిరకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments