Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంశంతో నీతో చిత్రంః సాత్వికా రాజ్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (17:12 IST)
Satvika Raj
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లుగా బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ  నీతో. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా  సాత్వికా రాజ్ సినిమా గురించి  పలుఆసక్తికర విషయాలను పంచుకుంది. 
 
- ఈ సినిమాలో నా పాత్ర  పెద్దగా ప్రాబ్లెమ్స్ అంటూ ఏమి లేని ఒక బిజినెస్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిగా కనిపిస్తాను. ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి, కొన్ని అనుకోని పరిస్థితిలు వలన  ఎటువంటి ప్రాబ్లెమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లెమ్స్ ను ఎలా ఫేస్ చేశాను అనేది  ఈ సినిమాలో నా కేరక్టర్. 
 
- ఇదొక లైట్ లవ్ స్టోరీ జాన్రా, కానీ రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే థీమ్ తో ఈ సినిమా మొత్తం సాగుతుంది. 
 
- వివేక్ సాగర్ గారితో నాకు అంతగా ఇంట్రాక్షన్ లేదు కానీ మా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, కథకు ఏమి కావాలి అది తన మ్యూజిక్ ద్వారా వివేక్ సాగర్ అందించారు. 
 
- అభిరామ్ వర్మ చాలామంచి  కో-స్టార్. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది, అభిరామ్ మంచి సపోర్టివ్ యాక్టర్, కొన్ని సీన్స్ తీసినప్పుడు కానీ, షాట్స్ లో రియాక్షన్స్ లో డైలాగ్స్ విషయం లో చాలా మంచి హెల్ప్ చేసాడు. 
 
- ఈ కథను మీకు చెప్పినప్పుడు  ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ లా కాకుండా చాలా డిఫెరెంట్ గా అనిపించింది. అది నాకు బాగా నచ్చింది. బాలు గారు నాకు ఈ కథ చాలా సేపు చెప్పారు.   చాలా లవ్ స్టోరీ లు ఉన్నాయ్, కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ అండ్ న్యూ  లవ్ స్టోరీ   రావాలంటే కష్టం,  సో ఈ కథను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.  ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది ఆశిస్తున్నాను.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments