Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైగ‌ర్ ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్‌తో సంతృప్తి చెందిన పూరీ !

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:17 IST)
Liger First Day Collection
విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ప‌బ్లిసిటీతో సెన్సేషనల్ స్టార్‌గా నిలిచిన చిత్రం `లైగ‌ర్‌`. ఈ సినిమా బాలీవుడ్‌లో బాయ్‌కాట్ వ‌ర‌కు వెళ్ళింది. అంత పాపుల‌ర్ అయిన ఈ సినిమాకు మొద‌టిరోజు క‌లెక్ష‌న్లు ఊహించిన‌ట్లుగానే వున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.  తెలుగు రాష్ట్రంలో  నైజాం కి చెందిన వసూళ్ల వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి.ఈ చిత్రం 4.25 కోట్లు షేర్ ని అయితే మొదటి రోజుకి గాను నమోదు చేసింది. 
 
మొత్తంగా విజ‌య్ కెరీర్‌లోనే  బెస్ట్ వసూళ్లనే అందుకున్నట్టు తెలుస్తుంది. మరి మిగిలిన చోట్ల ఎలా వుంది. ఓవ‌ర్ సీన్‌లోనూ, బాలీవుడ్‌లోనూ తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వ‌చ్చేసింది.  అయినా వ‌ర‌ల్డ్ వైజ్‌గా మొద‌టి రోజు 13.12 కోట్ల గ్రాస్‌గా నిలిచింద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. వ‌చ్చే వారం వ‌రకు పెద్ద సినిమా ఏదీ విడుద‌ల లేక‌పోవ‌డంతో లైగ‌ర్‌కు ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు.
 
ఏది ఏమైనా సినిమాను స‌రిగ్గా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తీయ‌లేద‌ని, క‌థ‌లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవ‌లం మొద‌టిరోజు క‌లెక్ష‌న్ల‌వ‌ర‌కే ఈ సినిమా ప‌రిమితం అవుతుందా?  లాంగ్‌ర‌న్‌లో నిలుస్తుందా అనేది ట్రేడ్‌వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. సోలో సినిమాగా వ‌చ్చిన లైగ‌ర్ యాక్ష‌న్ కోస‌మే చూసేవారికి న‌చ్చుతుంద‌ని విశ్లేషిస్తున్నాయి. మ‌రి ఈ సినిమా ప‌బ్లిసిటీ జిమ్మిక్క్ ఒక్క‌రోజుకే ప‌రిమితం అవుతుందేమోన‌ని ప‌లువురు అంచ‌నావేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments