Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ప్రొడక్షన్ లో సతీష్ వర్మ ఛాంగురే బంగారురాజా సిద్ధమైంది

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (17:34 IST)
Karthik Ratnam
మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
 
సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఫేవర్ కానుంది. ప్రధాన తారాగణంతో కూడిన రిలీజ్ డేట్ పోస్టర్ హ్యుమరస్ గా ఆసక్తిని రేకెత్తిస్తుంది.
 
‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్ ఇదివరకే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు. ఇది ప్రధాన పాత్రలు,  కథాంశాన్ని పరిచయం చేసింది. టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.
 
కృష్ణ సౌరభ్ సంగీతం సమకూరుస్తుండగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్.
 
త్వరలో ‘ఛాంగురే బంగారురాజా’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments