Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న "సాథి"

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (17:15 IST)
ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ దర్శకుల హవా నడుస్తోంది. కొత్త ఐడియాస్‌తో డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కిస్తూ...  ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులు హిట్ కొట్టాలన్న కసితో విభిన్న  తరహా చిత్రాలను రూపొందిస్తూ సక్సెస్‌లు సాధిస్తున్నారు. ఆ కోవలోనే రాజ్ కార్తీకేన్ "సాథి" వంటి డిఫరెంట్ టైటిల్‌తో ఒక సినిమాని తెరకెక్కించారు.
 
భార్గవి క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. బస్టాప్, గ్రీన్ సిగ్నల్, అత్తారిల్లు చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి రవికుమార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సోనియా, చంద్రిక, రాజ్ కార్తికేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో రిలీజ్ కానుంది.
 
డిసెంబర్ 9న దర్శకుడు రాజ్ కార్తికేన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా సాథి పోగ్రెస్‌ను తెలిపారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. అందులో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మా సాథి చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, యూత్ ఆడియెన్స్‌ని డిజప్పాయింట్ చేయదని గ్యారెంటీగా చెప్పగలను. దర్శకుడిగా ఈ చిత్రం నాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశిస్తున్నాను.. టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ చిత్ర విశేషాలను త్వరలో తెలియజేస్తాం.. అన్నారు. 
 
సాయి రవికుమార్, సోనియా, చంద్రిక, రాజ్ కార్తికేన్, ప్రియా పౌల్, అస్మిత, మధుమని, శ్రీలక్ష్మి, మాస్టర్ జాయ్, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ రాము, డిఎంకె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కెమెరా: ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఎడిటర్: ఉదయ్ రచన-దర్శకత్వం: రాజ్ కార్తికేన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

యాంటీబయాటిక్స్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments