సర్కారు వారి పాట సరికొత్త రికార్డ్.. ట్విట్టర్‌లో ట్రెండ్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:18 IST)
సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం సర్కారు వారి పాట చిత్రం అప్పుడే రికార్డుల ప్రభంజనం మొదలు పెట్టింది. నేటి నుండి చిత్ర షూటింగ్ మొదలైందని మేకర్స్ కొద్ది సేపటి క్రితం అఫీషియల్‌గా ప్రకటించగా, 20రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. 
 
ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరగనుంది. 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ బ్యాక్‌ డ్రాప్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా నటిస్తాడని సమాచారం. 
 
మహేష్ బాబు సినిమాలకు రికార్డులు కొత్త కాదు. ఎన్నో చిత్రాలు మంచి రికార్డులు సాధించాయి. తాజాగా సర్కారు వారి పాట చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. 
 
కొంతకాలం నుంచి మహేష్ నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా హాష్ టాగ్‌ను ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ట్వీట్స్‌తో అదరగొట్టారు. దీంతో ఆ మార్క్ వంద మిలియన్స్ క్రాస్ అయింది. ఇప్పటి వరకు ఏ సినిమా ట్యాగ్ కూడా ఈ రేంజ్‌లో ట్రెండ్ కాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్‌తో పాటు చిత్ర బృందం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments