సర్కారు వారి పాట బాణీల కూర్పు పూర్త‌యిదంటున్న థ‌మ‌న్‌

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (17:10 IST)
Thaman - Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా కోసం బాణీలు కూర్చే ప‌నిలో వున్నాడు థ‌మ‌న్‌. అవి శుక్ర‌వారంనాటికి పూర్త‌య్యాయ‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తెలియ‌జేశాడు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌తో వున్న ఫొటోను షేర్ చేశాడు థ‌మ‌న్‌. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే వినూత్న‌మైన సినిమాగా నిలుస్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు. పాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కాన్ని తెలియ‌జేస్తున్నాడు. త్వ‌ర‌లో పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 
 
కాగా, ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌తో పాటు ఇతర తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక్క‌డే  పాట‌ల‌ను కూడా చిత్రీక‌రించ‌నున్నారు. ఇటీవ‌లే కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌కి సంబంధించి రివీల్ చేశారు.  స్టైలిష్ లుక్ లో కనిపించింది. డెనిమ్ జాకెట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కీర్తి దర్శనమిచ్చింది. 
 
పరశురామ్ ద‌ర్శ‌క‌త్వం హిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఆర్ మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు.  2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments