Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ సినిమాకే ఇంత జడుసుకుంటారా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైర్

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (12:15 IST)
హీరో విజయ్ - డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "సర్కార్". నవంబర్ 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రంలోని కోమలవల్లి పాత్ర తమ అధినేత్రి దివంగత జయలలితను పోలినట్టుగా ఉందని పేర్కొంటూ అధికార అన్నాడీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దీంతో ఈ చిత్రాన్ని రీసెన్సార్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 
 
అదేసమయంలో ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళను రాబడుతోంది. ఇందులోభాగంగా, తొలి రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మేరకు గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. పైగా, దీపావళికి విడుదలైన చిత్రాలన్నీ తేలిపోవడంతో సర్కార్ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఈ పరిస్థితుల్లో ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర ఆగ్రహంను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో వరలక్ష్మి శరత్ కుమార్.. ఒక సినిమాని చూసి ఇంతగా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం మరీ ఇంత బలహీనమా? మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ బలహీనతను మీరు బయట పెట్టుకున్న వారు అయ్యారు. ఇప్పటికైనా మీరు మీ తెలివి తక్కువ పనులు మానేయండి. క్రియేటివిటీకి సంకెళ్లు వేయాలని ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వరలక్ష్మి ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments