Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో లేడీ సూపర్ స్టార్ లుక్ అదుర్స్

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, దీపావళి పండుగను పురస్కరించుకుని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లుక్‌ను కూడా విడుదల చేశారు. 
 
ఈ చిత్రంలో భారతి పాత్రను పోషిస్తున్న విజయశాంతి లుక్ అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది. విజ‌య‌శాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ పాత్ర‌లో కనిపించ‌నున్నార‌ని భావించినప్ప‌టికి, తాజాగా విడుద‌లైన లుక్ చూస్తుంటే ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంద‌ని ఇట్టే తెలిసిపోతోంది.
 
నిజానికి 80-90 దశకంలో విజయశాంతి లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షక నీరాజనాలు అందుకున్నారు. మళ్లీ 13 యేళ్ల తర్వాత ఆమె వెండితెరపై కనిపించనున్నారు. పైగా, సరిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. 
 
ఈ చిత్రంలో మహేష్ సరసన ర‌ష్మిక మంథనా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments