Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా షేక్ : 'సారంగదరియ' న్యూరికార్డ్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (11:12 IST)
అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "లవ్ స్టోరీ". ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఫిబ్రవరి 28న సారంగ‌ద‌రియా అనే ఫోక్ సాంగ్ విడుద‌ల చేశారు. మంగ్లీ పాడిన సారంగద‌రియా పాట సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది. పాట‌కు త‌గ్గ‌ట్టు అదిరిపోయే స్టెప్పుల‌తో సాయి ప‌ల్ల‌వి ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేయ‌డంతో ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు‌పైగా వ్యూస్ దక్కించుకుంది. 
 
తెలుగు సినిమా పరిశ్రమలో అతి త‌క్కువ స‌మ‌యంలో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి పాట‌గా రికార్డు న‌మోదు చేసుకుంది. గ‌తంలో సాయి ప‌ల్ల‌వి న‌టించిన ప‌లు సినిమాల‌లోని పాట‌లు కూడా ఇంతే రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. ఇపుడు సారంగ‌ద‌రియా పాటతో ఆమె తన రికార్డులను తిరగరాశారు. కాగా, ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

ప్రేమ వివాహాలకు వేదిక కానున్న సీపీఎం కార్యాలయాలు!!

నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments