Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన సారంగ దరియా.. బుట్టబొమ్మను వెనక్కి నెట్టిందిగా!

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:06 IST)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఫిబ్రవరి 28న సారంగదరియా అనే ఫోక్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
 
మంగ్లీ పాడిన సారంగదరియా పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాటకు తగ్గట్టు అదిరిపోయే స్టెప్పులతో సాయి పల్లవి ప్రేక్షకులని ఫిదా చేయడంతో ఈ పాట యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి పాటగా రికార్డు నమోదు చేసుకుంది. ఫలితంగా ‘సారంగ దరియా’ అల్లు అర్జున్ బుట్టబొమ్మను అధిగమించింది. ఈ పాటను దాటి 100 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. 100 మిలియన్ల వ్యూస్ సంపాదించేందుకు సారంగ దరియాకు కేవలం 31 రోజులు మాత్రమే పట్టింది. 
 
గతంలో సాయి పల్లవి నటించిన పలు సినిమాలలోని పాటలు కూడా ఇంతే రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సారంగదరియా పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ పాడింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments