Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు

డీవీ
మంగళవారం, 30 జులై 2024 (20:12 IST)
Vikrant
మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ యాడ్ ను రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం  "సంతాన ప్రాప్తిరస్తు". వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా తెరకెక్కుతోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హెల్దీ డైట్, మెడిసిన్స్, వ్యాయామం, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం, బుక్స్ తో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం..ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న హీరో స్టిల్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments