ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:37 IST)
ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే, దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల నీరజనాలు అందుకుంది. ముఖ్యంగా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 
 
వెంకటేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫలితంగా 13 రోజుల్లో ఈ చిత్రం రూ.208.9 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్టు ప్రకటించారు. ఇందులో గ్రాస్‌గా రూ.121.35 కోట్లు ఉన్నాయి. కాగా, ఐటీ సోదాలకు ముందు ఈ చిత్రం భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టినట్టు ముఖ్యంగా రూ.250 కోట్లను దాటేసిందనీ త్వరలోనే రూ.300 కోట్లకు చేరుతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఐటీ సోదాల్లో అనేక చిత్రాల కలెక్షన్లలో డొల్లతనం ఉన్నట్టు తేలింది. ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్లు కూడా తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments