Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖల్నాయక్' నిజజీవితాన్ని కళ్ళకు కట్టిన 'సంజూ' మూవీ ట్రైలర్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా, 'ఖల్నాయక్‌'గా పేరు గడించిన స్టార్ సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో ముద్దాయిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజూ".

Webdunia
గురువారం, 31 మే 2018 (08:46 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా, 'ఖల్నాయక్‌'గా పేరు గడించిన స్టార్ సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో ముద్దాయిగా తేలి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజూ". ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌లోనే సంజయ్ దత్ జీవితం మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆయన జీవితంలోని అనేక అంశాలను, కోణాలను టచ్ చేస్తూ ఈ ట్రైలర్‌ను తయారుచేశారు.
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పోషిస్తున్నారు. ఈయన ఓ సన్నివేశంలో న్యూడ్‌గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా... రణబీర్‌ను ఇదే అంశంపై ప్రశ్నించింది. ఈ సీన్ షూట్‌ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారా? అని విలేకరులు రణబీర్‌ను అడిగారు. దీనికి రణబీర్ సమాధానమిస్తూ 'నా తొలి సినిమాలోని ఒక సీన్‌లో నా టవల్ జారిపోవడంతో న్యూడ్‌గా మారిపోయాను. నేను నిజ జీవితంలో ఎంతో బిడియపడుతుంటాను. అయితే కెమెరా ముందుకు రాగానే ఏ సీన్ చేయాలన్నా బిడియపడను. ఇది నా పని అనుకుని చేస్తాను' అన్నారు. 
 
ఈ చిత్రం జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తుండగా, వినోద్ చోప్రా ఫిల్మ్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌తో పాటు.. అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా, జిమ్ సర్బా తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments