Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజయ్ దత్‌కు ఆస్తిని రాసిచ్చింది.. ఆపై కన్నుమూసింది.. ఆమె ఎవరు?

అభిమానం అనేది అంతులేనిది అని నిరూపించింది.. ఓ అభిమానురాలు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును తన అభిమాన నటుడికే రాసిచ్చింది. ముంబైలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ అభిమా

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (17:52 IST)
అభిమానం అనేది అంతులేనిది అని నిరూపించింది.. ఓ అభిమానురాలు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును తన అభిమాన నటుడికే రాసిచ్చింది. ముంబైలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ అభిమాని ఎవరు. ఆ నటుడు ఎవరో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ముంబై వాసి నిధి త్రిపాఠి అనే మహిళ.. సంజయ్‌ దత్‌కు వీరాభిమాని. 
 
నిధి త్రిపాఠి.. తన ఆస్తినంతా సంజయ్ దత్ పేరిట రాసిపెట్టి మరణించింది. ఆమె మరణించేందుకు కొన్ని నెలల ముందే తన ఆస్తంతా బ్యాంక్ ఆఫ్ బరోడాలో సంజయ్ దత్ పేరిట డిపాజిట్ చేసింది. కానీ జనవరి 30న బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సంజయ్‌కు ఫోన్ వచ్చింది. నిషి అనే మహిళ తన ఆస్తిని మీ పేరిట డిపాజిట్ చేసిందని బ్యాంక్ అధికారి చెప్పాడు. 
 
ఈ విషయం విన్న సంజయ్ దత్ షాక్ తిన్నాడు. అలాగే నిధి కుటుంబ సభ్యులు కూడా ఖంగుతిన్నారు. దీంతో సంజయ్ అప్రమత్తమై.. ముందు నిధి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా.. తనకు ఆ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదని న్యాయవాదితో బ్యాంకుకు లేఖ పంపించాడు. అభిమానుల నుంచి కానుకలు రావడం అలవాటే. నిధి ఎవరో కూడా తనకు తెలియదు. అయితే తన అభిమాని అంటోన్న నిధి తన పేరిట రాసిన ఆస్తుల్ని ఆమె కుటుంబీకులకు చేరే దిశగా తన వంతు సాయం చేస్తానని సంజయ్ దత్ మీడియా ముందు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments