Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ అలా చేస్తే బాగుండు.. గవర్నర్ మనకు పట్టిన దరిద్రం.. ఇక వెంకయ్య?: శివాజీ

ఏపీకి ప్రత్యేక హోదా గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై ఒక్కోసారి మాట్లాడుతున్నారని.. ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారని సినీనటుడు శివాజీ అన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం రంగం లోకి దిగి

పవన్ అలా చేస్తే బాగుండు.. గవర్నర్ మనకు పట్టిన దరిద్రం.. ఇక వెంకయ్య?: శివాజీ
, గురువారం, 1 మార్చి 2018 (16:07 IST)
ఏపీకి ప్రత్యేక హోదా గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై ఒక్కోసారి మాట్లాడుతున్నారని.. ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారని సినీనటుడు శివాజీ అన్నారు. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం రంగం లోకి దిగితే బాగుంటుందని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం గుంటూరు జిల్లాలో గురువారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు.
 
ఈ సదస్సుకు చలసాని శ్రీనివాసరావు, సీపీఐ రామకృష్ణ, సినీనటుడు శివాజీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రోడ్లపై వచ్చి ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటం చేయనిదే ప్రత్యేక హోదా సాధించడం కష్టమని శివాజీ తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయని శివాజీ ఆరోపించారు. 
 
ఇంకా శివాజీ గవర్నర్ నరసింహన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యారని శివాజీ ధ్వజమెత్తారు.
 
మనకంటే ముందు రాష్ట్రానికి చెందిన 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాటం చేయాలని పిలుపు నిచ్చాపు. ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలు ఆడుతున్నారని, పార్లమెంట్‌ను స్తంభింపచేస్తే సక్సెస్ అయినట్టేనని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్.. ఒక యేడాది పాటు ఉచితం