Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌రిలేరు నీకెవ్వ‌రులో... సంగీత న‌టిస్తుందా..?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (23:09 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ నెల 26 నుంచి హైద‌రాబాద్‌లో సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
 
లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి మ‌రో ఇంట్ర‌ెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... తెలుగుతెరపై అటు గ్లామర్ పరంగాను .. ఇటు ప‌ర్ఫార్మెన్స్ పరంగాను మంచి పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికల్లో సంగీత ఒకరు. ఖ‌డ్గం సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువ‌చ్చింది. 
 
పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. ఈమధ్యనే తమిళంలో రీఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకి నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. స‌రిలేరు నీకెవ్వ‌రులో సంగీత ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ట‌. అనిల్ రావిపూడి ఇటీవ‌ల సంగీత‌కు క‌థ గురించి ఆమె క్యారెక్ట‌ర్ గురించి చెప్పి ఒప్పించార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కనుక... సంగీత‌కు తెలుగులో ఈ మూవీ రీ-ఎంట్రీ. మ‌రి.. ఈ సినిమాతో వ‌రుస‌గా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుని బిజీ అవుతుందేమో..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments