అర్జున్ రెడ్డి కాంబినేష‌న్లో సినిమా, ఇంత‌కీ ఎప్పుడు..?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (18:34 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ - సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సినిమాతోనే వీరిద్ద‌రి ద‌శ తిరిగిపోయింది. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి అయితే... ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా... బాలీవుడ్‌లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు సినీ జ‌నం.
 
కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేసేందుకు అవకాశం రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కూడా సందీప్ దర్శకత్వంలోనే కబీర్ సింగ్‌గా తెరకెక్కించగా అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టించింది. దీనితో ఇప్పుడు మరో సినిమాకు బాలీవుడ్లో సందీప్ శ్రీకారం చుట్టారు. 
 
అయితే.. సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కు గాను వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ విజ‌య్‌తో మీ సినిమా ఎప్పుడు అని సందీప్‌ని అడిగితే... ప్ర‌స్తుతం హిందీ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా అయిన త‌ర్వాత విజ‌య్‌తో సినిమా చేస్తాన‌ని తెలిపారు. సో... అర్జున్ రెడ్డి కాంబినేష‌న్లో మూవీ అయితే.. నెక్ట్స్ ఇయ‌ర్లో సెట్స్ పైకి వెళ్ళ‌చ్చు. మ‌రి.. ఈసారి విజ‌య్‌ని ఎలా చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments