Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందీప్ కిష‌న్ టైటిల్ మార్పు. గ‌ల్లీరౌడీ ఫిక్స్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:09 IST)
gully roudy team
కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూతనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ముందుగా ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కొన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా ఈ సినిమా టైటిల్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మార్చారు. ఇప్పుడీ చిత్రానికి ‘గ‌ల్లీరౌడీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 
 
టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరిస్తున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌న్ రైడ‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments