Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్గంలో ఉన్న జయలలిత తలైవి ట్రైలర్ చూసి ఆశ్చర్యపోతుంది : ఆర్జీవీ (Video)

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (15:43 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 23వ తేదీన కంగనా పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ట్రైలర్‌ను చూసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తలైవి టీమ్‌ను అభినందించారు. పైగా, కంగనపై పొగడ్తల వర్షం కురిపించారు. 
 
"హాయ్ కంగనా అండ్ టీమ్. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో, కొన్ని విషయాల్లో నిన్ను నేను వ్యతిరేకించవచ్చు. అయితే, ఇంత సూపర్ డూపర్ స్పెషల్ క్యారెక్టర్ ను చేసినందుకు నీకు సెల్యూట్ చేస్తున్నాను. తలైవి ట్రయిలర్ మైండ్ బ్లోయింగ్. స్వర్గంలో ఉన్న జయలలిత కూడా దీన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతారు" అని వ్యాఖ్యానించారు.
 
దీనికి కంగనా కూడా తనదైనశైలిలో స్పందించింది. "హాయ్ సార్. నేను మిమ్మల్ని ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదు. గర్వం, ఈగో నిండిపోయిన ఈ ప్రపంచం ఎంతో సులువుగా మనసులను బాధిస్తుంది. ఈ సమయంలో మీరు చూపే దృక్పథాన్ని నేను అభినందిస్తాను. మీరుదేన్నీ సీరియస్‌గా తీసుకోరు. మిమ్మల్ని మీరు కూడా. మీ పొగడ్తలకు కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments