Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో గాయపడిన సంయుక్త హెగ్డే

Webdunia
గురువారం, 28 జులై 2022 (11:27 IST)
Samyuktha
నిఖిల్ హీరోగా తెరకెక్కిన్న 'కిరాక్ పార్టీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ సంయుక్త హెగ్డే. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లో గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె 'క్రీమ్' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈమెకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆమె ఎలా గాయపడింది? అనే విషయాన్ని తెలుపడానికి ఓ వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది.
 
ఓ ఫైటర్‌ను ఎగిరి తన్నుతున్న క్రమంలో ఈమె బ్యాలెన్స్ తప్పి కిందపడింది. కుడికాలు సరిగ్గా లాండ్ కాకపోవడం వల్ల బలమైన గాయమైనట్లు స్పష్టమవుతుంది. దీంతో కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు దూరం కానుంది.  
 
'కిరాక్ పార్టీ' తో పాటు ఈమె 'కాలేజ్ కుమార్' అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది. మొన్నామధ్య 'ఆహా'లో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా 'మన్మథ లీలై'లో కూడా నటించింది. ఇప్పటివరకు ఈమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 12కి పైగా సినిమాల్లో నటించింది.
 
అలాగే బిగ్ బాస్ వంటి టీవీ షోలలో కూడా పాల్గొంది ఈ నటి. 'కిరాక్ పార్టీ' (కన్నడ) చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. ఇక సంయుక్త షూటింగ్‌లో గాయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments