Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియా భట్ ఫైర్.. నేను ఈ వయస్సులో పిల్లల్ని కంటే మీకేంటి ప్రాబ్లమ్?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (22:45 IST)
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ అలియాబట్ వివాహం చేసుకున్న రెండు నెలలకే తాను గర్భవతిని అయ్యానంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆమె గర్భం మీద కూడా చాలా మంది భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆమెకు శుభాకాంక్షలు చెబితే మరి కొంత మంది మాత్రం కాస్త ఇబ్బందికరమైన కామెంట్లు చేశారు. 
 
చిన్న వయసులో తల్లి కావడం ఏమిటని కొందరు కామెంట్ చేస్తే పెళ్ళైన వెంటనే తల్లి కావడం ఏమిటంటూ కొందరు ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ విషయం మీద స్పందించిన అలియా భట్ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు.
 
మాములుగా ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ ఏదో పెద్ద వార్త అనిపిస్తుంది, అమ్మాయి ఎవరినైనా ప్రేమించినా, తల్లి కాబోతుందని తెలిసినా అన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతారని ఆమె విమర్శించారు. అంత ఎందుకు క్రికెట్ చూడటానికి వెళ్లినా, ఏదైనా హాలిడే ట్రిప్‌కి వెళ్ళినా సరే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తారని అలియా భట్ కామెంట్ చేశారు. 
 
ఇక తనది యుక్త వయసే అయితే ఇప్పుడు పిల్లలని కంటే వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఆమె ప్రశ్నించారు. నేను చిన్నదాన్నే అయితే ఏంటి? ఒక ఫ్యామిలీ, లేదా పిల్లలను కలిగి ఉండటం నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అవి రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలని అలియా పేర్కొన్నారు.
 
అంతేకాక కొన్ని గొప్ప విషయాలు మనం ప్లాన్ చేసుకోనవసరం లేదని వాటంతట అవే జరిగిపోతాయంటూ తన గర్భధారణ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ విషయాల గురించి ఆలోచించేంత సమయం తనకు లేదని తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానని అలియా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments