నాలో తీవ్ర‌వాదిని వాయిదా వేశానంటున్న స‌మంత‌

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:42 IST)
Samantha Akkineni, Family man2
స‌మంత అక్కినేని `ఫ్యామిలీ మేన్2` వెబ్ సిరీస్ చేసింది. లెక్క‌ప్ర‌కారం ఈ నెల 12వ తేదీన ప్రైమ్ వీడియోస్‌లో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల వాయిదా ప‌డింది. అది కూడా మంచికే అంటోంది స‌మంత‌. వేస‌విలో హాయిగా చూసుకోవ‌డానికి స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు సోష‌ల్‌మీడియాలో తెలియ‌జేసింది. దర్శక ద్వయం రాజ్, డీకే సృష్టించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.

ఈ రెండో సీజన్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణితో పాటు సమంత కూడా ముఖ్య పాత్రలో నటించింది. దీనిలో సమంత తీవ్రవాది పాత్రలో నటించింది. దీంతో ఈ సిరీస్ కోసం సమంత అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ``ఫ్యామిలీ మ్యాన్` సీజన్‌ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు.

మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకే విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం` అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. నాలో తీవ్ర‌వాదిని అప్పుడు చూడండంటూ చ‌లోక్తి విసిరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments