Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రేమమ్'' రివ్యూకు పాజిటివ్ టాక్.. ఎగిరిగంతేసిన సమంత... ట్విట్టర్లో హ్యాపీ హ్యాపీ

ఏ మాయ చేసావె హీరో నాగ చైతన్య తాజా సినిమా ప్రేమమ్ శుక్రవారం రిలీజ్ కావడానికి తోడు మంచి రివ్యూ టాక్ రావడంతో సమంత ఎగరి గంతేస్తోంది. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని సమంత ఫ్యాన్స్‌తో పంచుకుంది. సంతోషంగా ఉన

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (16:24 IST)
ఏ మాయ చేసావె హీరో నాగ చైతన్య తాజా సినిమా ప్రేమమ్ శుక్రవారం రిలీజ్ కావడానికి తోడు మంచి రివ్యూ టాక్ రావడంతో సమంత ఎగరి గంతేస్తోంది. ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని సమంత ఫ్యాన్స్‌తో పంచుకుంది. సంతోషంగా ఉన్నప్పుడు కేకేలేస్తామో, నవ్వుతామో, ఏడుస్తామో, గంతులేస్తామో తెలియదు కానీ ప్రేమమ్ సినిమాకు మంచి రివ్యూలు రావడంతో తాను ఇవన్నీ కలిపి చేసేస్తున్నానంటూ ట్విట్టర్‌లో 'ప్రేమమ్‌' అనే హాష్‌ టాగ్‌ను జత చేసి లవ్ సింబల్‌లో పోస్టు చేసింది సమంత. 
 
అంతేకాదు ఓ మీడియా సంస్థ రాసిన 'ప్రేమమ్‌' రివ్యూ స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్ట్‌చేసింది. ప్రేమమ్ సినిమా మంచి గుర్తింపుతో పాటు కలెక్షన్స్ తెస్తుందని సమంత గురువారమే ట్విట్టర్లో పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ కావడంతో పాటు పాజిటివ్ టాక్ రావడంతో సమంత ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
 
కాగా మలయాళంలో హిట్ సాధించిన 'ప్రేమమ్‌' రీమేక్‌గా చందు మొండేటి ఈ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలుగా నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments