Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహం కోసం మామ సినిమాలో మళ్లీ సమంత

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:39 IST)
నాగార్జున నటించిన మనం, రాజుగారి గది 2 వంటి సినిమాలలో ఆయన కోడలు సమంత కూడా నటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా.. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున సొంత నిర్మిస్తూ..  హీరోగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2. మరి అక్కినేని వారి కొత్త కోడలు సమంత ఈ సినిమాలో కూడా ఒక పాత్రలో తళుక్కుమనబోతున్నారని సమాచారం.
 
వివరాలలోకి వెళ్తే... నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న ఈ సినిమాలో... సమంత పోషించబోతున్న పాత్ర ఏమిటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మరియు ఆయన భార్య చిన్మయిలతో సమంత చాలా క్లోజ్‌గా ఉంటుంది. సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పే వ్యక్తి చిన్మయి. ఇక సమంత మొదటి సినిమా హీరో రాహుల్ రవీంద్రన్. అందుకే ఆ జంట అంటే సమంతకు చాలా అభిమానం. ఈ ముగ్గురి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
అలాంటి రాహుల్ దర్శకుడుగా చేస్తున్న ద్వితీయ ప్రయత్నం కావడంతో సమంత తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత ఉంటే ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుందని భావించిన దర్శకుడు రాహుల్ ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను క్రియేట్ చేసాడనీ ఆ పాత్రను చేసేందుకు సమంత వెంటనే ఒప్పుకుందనీ తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ సినిమా కావడంతో పాటు మామ నాగార్జున నిర్మిస్తున్న సినిమా కూడా కావడంతో పాత్ర చిన్నదే అయినా సమంత కాదనలేక పోయిందనే టాక్ వినిపిస్తుంది. కాగా... ఈ విషయమై ఇంకా యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావలసి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments