Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ సరసన సమంత.. పంజా దర్శకుడితో కలిసి..?

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (17:05 IST)
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించే ఆఫర్‌ను సమంత కొట్టేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌ "సిటాడెల్" హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ విడుదల త్వరలో విడుదల కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సమంత కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
పుష్ప చిత్రంలో ప్రత్యేక పాటతో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన సమంత ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా, కరణ్ జొహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌‌గా సమంత పేరు తెరపైకి వచ్చింది.
 
కాగా ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే జవాన్ ద్వారా నయనతార, లవ్ స్టోరీ హిందీ రీమేక్ ద్వారా సాయిపల్లవి, తాజాగా సమంత సల్మాన్ ఖాన్‌తో నటించేందుకు సిద్ధం అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments