Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సమాజం.. మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు... సమంత

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:19 IST)
అక్కినేని నాగ చైతన్య- సమంతల వివాహం విడాకులతో ముగిసింది. ఏడేళ్ల ప్రేమ, మూడేళ్ల వివాహబంధాలకు పుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమని, కేవలం స్నేహితులుగానే ఉండాలనుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. 
 
అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తుంటే.. మరికొందరూ సమంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్ చేసిందనీ, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే చేసిందనీ, మరికొందరూ ఓ లైన్ దాటి.. ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందనీ దారుణంగా ట్రోల్ చూస్తూ నిందలేస్తున్నారు.
 
ఇవే విడాకులకు కారణాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరూ సమంతకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. కానీ ట్రోల్స్ ఆగడంలేదు. ఈ క్రమంలో సమంత తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నించే ఈ సమాజం.. అదే మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
నాగచైతన్య నుంచి దూరమయ్యాక సమంత చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments