Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యతో శోభిత రిలేషన్‌షిప్‌లో ఉందా? సమంత క్లారిటీ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (17:01 IST)
తన మాజీ భర్త, హీరో నాగచైతన్య అక్కినేనితో మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా తాను గతంలో వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలను ఖండించిన సమంత.. తాను ఎప్పుడూ అలా అనలేదని స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ లింక్‌ను కోట్‌ చేస్తూ సమాధానం ఇచ్చారు.
 
సమంత కథానాయికగా నటించిన 'శాకుంతలం' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రిలేషన్‌షిప్‌ వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. 'ఎవరు ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం ఉన్నా కూడా కన్నీళ్లు మిగులుతాయి. 
 
కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. అతని ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది' అని సమంత అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. నాగచైతన్య - శోభిత రిలేషన్‌షిప్‌పైనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు ప్రచురించారు. దీనిపై స్పందించిన సామ్‌ తాను ఎప్పుడూ అలా అనలేదని సమాధానం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments