Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూని గుర్తుచేసుకున్న సామ్-మజిలీలా కలిసిపోవచ్చుగా..?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (19:46 IST)
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఇప్పటివరకు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పోస్టులు పెట్టలేదు. తాజాగా సమంత ఓ పోస్ట్‌ని తన స్టోరీలో పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 
 
సమంత, చైతూ కలిసి చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా మజిలీ. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో సమంత తన ఇన్‌స్టా స్టోరీలో మజిలీ పోస్టర్‌ని పెట్టింది. అయితే సమంత సింగిల్ పోస్టర్ పెట్టకుండా, చైతూ సింగిల్‌గా ఉన్న పోస్టర్‌ని పెట్టింది. ఆ పోస్టర్‌లో వెనకాల చైతూ ఇద్దరు హీరోయిన్స్‌తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. 
 
సమంత ఇలా మజిలీ సినిమా పోస్టర్‌ని చైతూ ఫోటోతో పెట్టడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మజిలీ లాగా ఇద్దరు మళ్ళీ కలిసిపోవచ్చు కదా, ఇద్దరు ఆ సినిమాలో లాగా అర్ధం చేసుకొని బతకొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు.
 
కొంతమంది అయితే అవన్నీ సినిమాల్లోనే రియల్ లైఫ్ వేరు అని అంటున్నారు. మొత్తానికి చైతూతో విడాకుల అనంతరం సమంత వారిద్దరూ కలిసి చేసిన సినిమా పోస్టర్‌ని పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments