Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత-చై ఫస్ట్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్... చిక్కంతా పొట్టి దుస్తులతోనే...

ఇటీవల నాగ చైతన్య సినిమా శైలజా రెడ్డి అల్లుడు, సమంత సినిమా యూటర్న్ ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. ఈ విడుదలకు తర్వాత యువజంట వెకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (14:11 IST)
ఇటీవల నాగ చైతన్య సినిమా శైలజా రెడ్డి అల్లుడు, సమంత సినిమా యూటర్న్ ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. ఈ విడుదలకు తర్వాత యువజంట వెకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లింది. సమంతా అడపాదడపా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, పోస్ట్‌లను పెడుతున్నారు. వీరిద్దరికీ పెళ్లయి అక్టోబర్ 6కి సరిగ్గా సంవత్సరమవుతోంది. కనుక తమ కుటుంబ సభ్యులతో కలిసి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు ఈ జంట.
 
ఇప్పటికే స్పెయిన్ దేశంలోని ఇబిజా ఐలాండ్‌లో వెకేషన్ కోసం చై, సామ్ ఉండగా, దేవదాస్ సినిమా ప్రమోషన్స్ పార్ట్ పూర్తి చేసుకుని, అక్కినేని నాగార్జున, అఖిల్, అమలు ఇంకా మరికొంత మంది కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో స్పెయిన్ ఫ్లైట్ ఎక్కేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మామా కోడళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీరితో పాటు ఇప్పటికే ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మోడల్ శిల్పారెడ్డి కూడా ఉన్నారు. ఇక వీరంతా కలిసి పార్టీలు, పబ్బులు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమంత కూడా పెళ్లయ్యాక ఇంకా సంతోషంగా ఉన్నట్లు ఆమె పెడుతున్న ఫోటోలను చూస్తేనే అర్థమవుతోంది.
 
పబ్బులలో వైన్ గ్లాసులతో ఉన్న ఫోటోలు, కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలు, ఇంకా ఏకాంత ఫోటోలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని తనకు ఇష్టమైన వ్యక్తితో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరుపుకుంటున్నందుకు సంతోషంతో పొంగిపోతోందట ఈ బ్యూటీ. ఐతే చిక్కంతా ఆమె అక్కడ వేసుకుని తిరుగుతున్న కురుచ దుస్తులు గురించే. నెటిజన్ల వాటిపైన కామెంట్లు చేస్తున్నారు. ఐతే సమంత మాత్రం వాటిని కూరాకులో పురుగులా చూస్తోంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments