Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో చైత‌న్య ఏం చేస్తున్నాడు..?

అక్కినేని నాగ‌చైత‌న్య ఓవైపు స‌వ్య‌సాచి, మ‌రో వైపు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌రో రెండు సినిమాలు ఓకే చేసాడు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (19:56 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య ఓవైపు స‌వ్య‌సాచి, మ‌రో వైపు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌రో రెండు సినిమాలు ఓకే చేసాడు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్నాయి. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే... చైత‌న్య ముంబై వెళ్లారు.
 
ఎందుకంటే... రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న చైతు మ‌రోవైపు యాడ్స్ కూడా చేస్తున్నాడు. అది కూడా స‌మంత‌తో క‌లిసి. యాడ్ షూట్ కోసం చైత‌న్య స‌మంత‌తో క‌లిసి ముంబాయి వెళ్లాడు. ఈ ఇద్దరూ షూట్‌ అయిపోయిన వెంటనే ముంబై రెస్టారెంట్‌లో సరదాగా సమయం గడిపారు. వర్క్‌ని, వీకెండ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు సమంత. ఈ జంట పెళ్లి త‌ర్వాత తొలిసారి క‌లిసి శివ నిర్వాణ‌తో చేస్తోన్న సినిమాలో న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments