చైత‌న్య‌, స‌మంత‌ల రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ప్రారంభం

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకు

Webdunia
సోమవారం, 23 జులై 2018 (16:17 IST)
మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "నిన్ను కోరి"తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.
 
దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావు రమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది. గోపీసుందర్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.
 
నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: శివ నిర్వాణ, నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్ , సంగీతం: గోపీ సుందర్ ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, ప్రోడ్కషన్ డిజైనర్: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి, కో-డైరెక్టర్: లక్ష్మణ్ మూసులూరి లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments