Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మెదడు మొద్దుబారిపోయింది.. డైవర్స్‌పై సమంత తండ్రి ఆవేదన

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:44 IST)
టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య, సమంతలు తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ మొత్తం ఒకింత షాక్‌కు గురైంది. వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపుపలికారు. టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరుతెచ్చుకున్న ఈ జంట అర్థాంతరంగా విడాకులు తీసుకోవటం అక్కినేని అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.
 
అలాంటిది సమంత ఫ్యామిలీకి ఇంకెంత బాధగా ఉంటుందో ఊహించలేం. వారికి స్పందించడానికి మాటలు ఉండవు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా ఒక ఆడపిల్లని కన్నవాడిగా సమంత తండ్రి బాధ వర్ణనాతీతం. ఇప్పటివరకు చే సామ్ విడాకులపై నాగార్జున మాత్రమే స్పదించగా.. సమంత కుటుంబం నుండి తండ్రి జోసెఫ్ తొలిసారి స్పందించారు. 
 
'నా మెదడు శూన్యంగా మారిపోయింది' అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని నెటిజెన్లు ఆయనను ఓదార్చే విధంగా పోస్టులు పెడుతున్నారు.
 
విడాకుల అనౌన్సమెంట్ తర్వాత చైతు ఒక హోటల్‌‍లో ఉంటుండగా.. సమంత మాత్రం చెన్నైలో షూటింగ్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉండగా.. చైతు మాత్రం మిన్నకుండిపోయాడు. ఈ జంట హార్ట్ బ్రేకింగ్ బ్రేకప్‌‍పై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తుండగా తొలిసారి సమంత తండ్రి జోసెఫ్ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments