Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో మనకెందుకు? ఖుష్బూ

Advertiesment
ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో మనకెందుకు? ఖుష్బూ
, సోమవారం, 4 అక్టోబరు 2021 (22:10 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో నాగ చైతన్య, ఆయన భార్య, హీరోయిన్ సమంతలు తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి, చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నామని వారిద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని అభిమానులే కాదు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఇదిలావుంటే సమంత తమ విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 'ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్థం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నాం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మాని చేయాల్సిన పనుల పైనే దృష్టి పెట్టాలి' అని ఇన్‌స్టా స్టోరీలో సమంత రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ విడాకులపై సీనియర్‌ నటి ఖుష్బూ స్పందించారు. 'భార్యభర్తల మధ్య ఏం జరిగింది అనేది, ఎందుకు విడిపోయారనేది వారిద్దరికీ తప్ప ఎవరికీ తెలీదు. వాళ్ల ప్రైవసీని అందరూ గౌరవించాలి. ఆ బాధ నుంచి వారు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దయ చేసి ఈ విషయంపై రూమర్లు క్రియేట్‌ చేయవద్దు' అంటూ ఖుష్బూ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధారం మూవీ ఫస్ట్ లుక్, లాంఛ్ చేసిన బెక్కం