Webdunia - Bharat's app for daily news and videos

Install App

`రంభ`గా స‌లోని

Webdunia
సోమవారం, 5 జులై 2021 (08:49 IST)
Ravanth - Saloni
నాయిక స‌లోని రంభ‌గా న‌టిస్తోంది. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్నచిత్రానికి 'రాజుకు నచ్చిందే రంభ` అనే పేరు పెట్టారు. రావంత్ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు ర్యాలి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌) నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుని రెగ్యులర్‌ షూటింగ్‌కు రెడీ అవుతోంది.
 
దర్శకుడు ర్యాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఒక హీరోయిన్‌గా సలోనీ నటిస్తోంది. మరో హీరోయిన్‌ని త్వరలోనే ఎంపిక చేస్తాము. చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నాం. చంద్రబోస్‌గారు, రామజోగయ్య శాస్త్రిగారు చాలా మంచి పాటలు ఇచ్చారు. రఘు కుంచెగారు అంతే అద్భుతంగా పాటలను కంపోజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. సాంగ్స్‌ రికార్డింగ్‌ త్వరలోనే మొదలవుతుంది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం  అని అన్నారు.
 
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, ఇది నాకు ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్‌. నాకు స్టార్‌ రైటర్స్‌ని ఇచ్చారు. నా మార్క్‌ మిస్‌ కాకుండా అద్భుతమైన బాణీలను సమకూర్చి, చిత్ర విజయంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నాను.." అన్నారు.
రావంత్‌, సలోని, అజయ్‌ ఘోష్‌, రఘు కుంచె, అప్పారావు తదితరులు నటించనున్న ఈ చిత్రానికి
సమర్పణ: వి. చిన్న శ్రీశైలం యాదవ్‌,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కృష్ణ మోహన్‌ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి, లైన్‌ ప్రొడ్యూసర్‌: కావిడి ఆనంద్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments