Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటీ కాదుకదా ప్రచారం కూడా చేయడం లేదు : సల్మాన్ ఖాన్

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:57 IST)
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ తరపున తాను పోటీ చేయడం లేదనీ, ప్రచారం కూడా చేయడం లేదని తేల్చి చెప్పారు.
 
సాధారణంగా ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు సినీ హీరో, హీరోయిన్లను తమ ప్రచారానికి ఉపయోగించుకుంటాయి. కొంతమంది ఒకే చెబుతూ ప్రచారం నిర్వహించడమేకాకుండా ఏకంగా ఎన్నికల బరిలో కూడా నిలుస్తుంటారు. బాలీవుడ్ కండలవీరుడి విషయంలో కూడా కొన్ని రోజులుగా ఓ విషయం ప్రచారం జరుగుతోంది. ఆయన ఎన్నికల బరిలో నిలుస్తున్నాడని.. ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. 
 
సల్మాన్ ఖాన్‌ ప్రచారంలోకి దింపాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అక్కడి నేత పంకజ్ చుతర్వేదీ కూడా చెప్పారు. సల్మాన్ ప్రచారం చేస్తాడనే విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై సల్మాన్ నీళ్లు చల్లేశాడు. మార్చి 21వ తేదీ గురువారం ట్విట్టర్ వేదికగా సల్మాన్ స్పందించారు.
 
తన ప్రచారం కోసం ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీల నేతల ఆశలపై నీళ్లు చల్లారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఏ పార్టీ తరపునా ప్రచారం కూడా చేయనని స్పష్టంచేశాడు. మరోవైపు ఓటింగ్ శాతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌పై ఈ కండల వీరుడు రెస్పాన్స్ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని... అర్హత ఉన్న ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సల్మాన్ ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments