Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (17:21 IST)
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభద్రతా భావంలో మెలుగుతున్నారు. ఆయనకు వరుసగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయనతో పాటు ఆయన ఇంటి పరిసరాల్లో భద్రతను రెట్టింపు చేశారు. ఫలితంగా సల్మాన్ చట్టూత పరిస్థితి హైఅలెర్ట్‌గా ఉంది. 
 
కాగా సల్మాన్ తమ భద్రత నిమిత్తం‌ గతేడాది ఓ బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రెండో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ గ్యారేజ్‌లో అన్నీ ప్రముఖ లగ్జరీ కార్స్ ఉన్నప్పటికీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, నిస్సాన్ పెట్రోల్ ఎస్యువిని ఎక్కువగా వాడుతుంటాడు. ఇది టాప్ టైర్ సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన హై ఎండ్ వాహనం. దీని ధర దాదాపు 2 కోట్లు  ఉంటుంది.
 
ఈ కారులో బ్లాస్టింగ్ వార్నింగ్‌తో పాటు, పాయింట్ బ్లాంక్ బుల్లెట్ షాట్‌లను తట్టుకునేలా మందపాటి గాజు షీల్డ్‌లు.. డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారిని ఏమాత్రం గుర్తించలేని విధంగా బ్లాక్ షేడ్స్ వంటి అధునాతన భద్రతా ఫీచర్స్‌ను కలిగి ఉంది‌. 5.6-లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కారు కలిగి ఉంది.
 
నిస్సాన్ పెట్రోల్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేని క్రమంలో సల్మాన్ ఖాన్ దుబాయ్ నుంచి కారును దిగుమతి చేసుకోవలసి వచ్చింది. తాజాగా దుబాయ్ నుండి సల్మాన్ రెండో బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఇంపోర్ట్ చేసుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన సభ్యులు సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments