Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

Advertiesment
Salman Khan

సెల్వి

, మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:48 IST)
Salman Khan
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకను చంపాడన్న విషయంలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు హత్యాయత్నం కూడా చేశాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచిన నేపథ్యంలో.. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్స్ అకౌంట్‌లో స్పందించాడు.
 
"సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపింది 1998లో. ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్ కేవలం ఐదేళ్ల
 వయసున్న పిల్లాడు. అలాంటి వాడు ఓ జింక కోసం 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా..!" అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇది ఆ జంతువుపై ఉన్న విపరీతమైన ప్రేమా లేక దేవుడు ఆడుతున్న వింత నాటకమా" అంటూ వర్మ ట్వీట్‌లో ప్రస్తావించాడు.. గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఓ లాయర్ ఓ జింకను చంపిన నేరానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ సూపర్ స్టార్‌ను హత్య చేయాలని చూస్తున్నాడు.
 
దీనికోసం తాను ఫేస్‌బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్న 700 మంది గ్యాంగ్ సభ్యలకు ఆదేశాలు ఇస్తున్నాడు. అదే స్టార్‌కు సన్నిహితుడైన ఓ రాజకీయ నాయకుడిని కూడా చంపాలని అనుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అతడు ప్రభుత్వ రక్షణలో ఓ జైలులో ఉన్నాడు. అధికారి ప్రతినిధి విదేశాల నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే స్టోరీని ఎవరైనా బాలీవుడ్ రైటర్ రాసి ఉంటే.. ఎప్పుడూ లేనంత నమ్మశక్యం కాని, హాస్యాస్పద స్టోరీ రాసినందుకు అతన్ని కొట్టేవారేమో" అని ఆర్జీవీ పోస్ట్ చేశాడు.
 
1998లో సల్మాన్ ఖాన్ అప్పట్లో వచ్చిన హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టపరంగా ఈ కేసులో సల్మాన్ కొద్ది రోజుల శిక్ష అనంతరం.. అతనికి ఫేవర్‌గా తీర్పు వచ్చింది. కానీ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికీ సల్మాన్‌ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని  కాల్చి చంపారు. 
 
దీంతో ఈ కేసు మరింత ప్రాధానత్య సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. సిద్దిఖీ హత్యతో సల్మాన్‌లోనూ చావు భయం‌ నెలకొందనే‌ ప్రచారం ఊపందుకుంది. సల్మాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది