Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై లో సలార్ సీక్వెల్ లో ప్రభాస్ పాల్గొననున్నారా?

డీవీ
శనివారం, 4 మే 2024 (18:27 IST)
Salar japan poster
ఇప్పటికీ ప్రభాస్ పలు సినిమాలు షూటింగ్ లో బిజీగా వున్నాడు. నాగ్ అశ్విన్ చిత్రంలో పాటు దర్శకుడు మారుతీ తో సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా వుండగా, మరోవైపు సలార్ సీక్వెల్ షూట్ కూడా జరుగుతుందని టాక్ ఇండస్ట్రీలో నెలకొంది.  “సలార్ శౌర్యంగ పర్వం” గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కాగా, ఈరోజు సలార్ సినిమాను జపాన్ లో విడుదలచేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది.
 
ప్రభాస్, ప్రుధ్వీరాజ్ కుమార్ నటించిన ఈ సినిమా  జూలై 5 నుండి జపాన్ అంతటా థియేటర్లలోకి రాబోతోంది. అక్కడ పలు సినిమాలు రిలీజ్ చేసిన మూవీవిన్ 2 ద్వారా పంపిణీ సంస్థ విడుదలచేయనుంది. 
 
అయితే అదే రోజు సలార్ సీక్వెల్ లో ప్రభాస్ పాల్గొననున్నాడని తెలుస్తోంది.  ఇప్పటికే మొదటి భాగం షూట్ చేసినప్పుడు కొంత సీక్వెల్ కు షూట్ చేశారనీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీక్వెల్ షూట్ జరుగుతుందనీ, అందులో ప్రభాస్ కు సంబంధంలేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రియారెడ్డి కూడా సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా వుంటాయని తెలిపింది. జూన్ లో తన ఎంట్రీ వుంటుందని కూడా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments