Webdunia - Bharat's app for daily news and videos

Install App

షకలక శంకర్ ‘డ్రైవర్ రాముడు’.. టీజర్ రిలీజ్..!

'జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా ఎంట‌ర్టైన్ చేసి... మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగానూ మారాడు. వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే ‘శంభో శంకర’ సినిమా నుంచి ఒక పాట కూడా విడు

Webdunia
బుధవారం, 23 మే 2018 (22:13 IST)
'జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బాగా ఎంట‌ర్టైన్ చేసి... మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంటున్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగానూ మారాడు. వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే ‘శంభో శంకర’ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘డ్రైవర్ రాముడు’ టీజర్ వచ్చింది. 
 
రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగళ్ల, ఎం.ఎల్.రాజు, ఆర్.ఎస్.కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా మొదటి ప్రచార చిత్రం అందరినీ ఆకట్టుకుంది. హీరో సుధీర్ బాబు చేతుల మీదుగా ‘డ్రైవర్ రాముడు’ టీజర్‌ను విడుదల చేయించారు. 
 
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘హాస్య నటుల్లో షకలక శంకర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమాలో శంకర్ ఉన్నాడంటే అందులో కామెడీ కచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు తాను హీరోగా వస్తున్నాడు అంటే ఆ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుందని అర్థం. ‘డ్రైవర్ రాముడు’ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు, దర్శకుడికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments