Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ - సునీల్ - భీమ‌నేని మూవీ టైటిల్ భ‌లే ఉంది..!

అల్ల‌రి న‌రేష్ - సునీల్ కాంబినేష‌న్లో భీమ‌నేని శ్రీనివాస‌రావు ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది. వరుస కామెడీ చిత్రాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఈ అల్లరోడు వరుస పరాజయాలతో డీలా పడ

Webdunia
బుధవారం, 23 మే 2018 (19:01 IST)
అల్ల‌రి న‌రేష్ - సునీల్ కాంబినేష‌న్లో భీమ‌నేని శ్రీనివాస‌రావు ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది.  వరుస కామెడీ చిత్రాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఈ అల్లరోడు వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. అయితే తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లోనే హిట్ కొట్టేందుకు ‘సుడిగాడు’ మూవీ దర్శకుడు భీమినేని శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఫుల్ ఫన్ మూవీ చేస్తున్నాడు. 
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి సిల్లీ ఫెలో అనే టైటిల్ అనుకున్నారు. అయితే... ఈ టైటిల్‌ను మ‌రో నిర్మాణ‌ సంస్థ రిజిష్ట‌ర్ చేయించుకోవ‌డంతో  ‘ఫన్ రాజా ఫన్’ అనే వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ‘ఫన్ రాజా ఫన్’ టైటిల్ సినిమాకు కరెక్ట్‌గా యాప్ట్‌ కావడంతో దీనివైపే మొగ్గుచూపారట చిత్ర యూనిట్. 
 
ఈ మూవీలో హీరో సునీల్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘రంగులరాట్నం’ ఫేమ్ శుక్ల.. నరేష్‌తో జోడీ కడుతోంది. నందిని రాయ్ మరో హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఈ టైటిల్‌తో పాటు వ‌చ్చాడ‌య్యో సామీ.. అనే టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నారని తెలిసింది. త్వ‌ర‌లోనే మూవీ టైటిల్‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments