Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిరాం శంకర్ నూతన చిత్రానికి ఇళయరాజా సంగీతం

Webdunia
మంగళవారం, 23 మే 2023 (15:41 IST)
పూరి జగన్నాథ్ తనయుడు సాయిరాం శంకర్ కథానాయకుడిగా విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 లాంఛనంగా ప్రారంభమైయింది. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 90‘s లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు.
 
ముహూర్తం సన్నివేశంలో '' గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు''అని సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.  
 
మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. అఫీషియల్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించి ఈ చిత్రానికి సంబధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.
 
మధుర వైన్స్, జైత్ర వంటి సినిమాలు పని చేసిన మోహన్ చారి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ద వంశీ (డైరెక్టర్) లిరిక్స్ అందించడం మరో విశేషం. అలాగే పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి పని చేసిన కార్తీక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి ఎడిటర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments