Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చెల్లిగా సాయిపల్లవి ఒప్పుకోలేదు, బిగ్ రిలీఫ్ ఫీలయ్యా: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (21:57 IST)
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రి-రిలీజ్ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ హాజరయ్యారు.
 
ఈ చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు స్కూలుకు వెళ్తుంటే ఎలా ఫీల్ అవుతారో తమకు కోవిడ్ తర్వాత అలాంటి ఫీలింగ్ కలుగుతోందన్నారు. ప్రత్యక్షంగా ప్రేక్షకులతో కలిసి వేడుకలు చేసుకుంటే వుంటే వచ్చే కిక్కే వేరని అన్నారు. నాగచైత్యన్య స్టడీగా మంచి సబ్జెక్టులు ఎన్నుకుంటూ వెళ్తున్నారని చెప్పారు. 
 
సాయిపల్లవి గురించి మాట్లాడుతూ... నా చిత్రంలో ఓ పవర్ ఫుల్ చెల్లెల పాత్రకు దర్సకనిర్మాతలు సాయిపల్లవిని అడిగినట్లు తెలిసింది. నాతో చెప్పారు. కానీ సాయి పల్లవి ఆ పాత్రను రిజెక్ట్ చేస్తే బాగుణ్ణు అనుకున్నాను. కారణం ఏంటో తెలియదు కానీ సాయిపల్లవి నో చెప్పేసింది. హమ్మయ్య అనుకున్నాను.
ఎందుకో తెలుసా... సాయిపల్లవి సూపర్ డ్యాన్సర్. అలాంటి డ్యాన్సర్ తో చెల్లెమ్మా అంటూ పాత్ర చేసేకంటే ఆమెతో కలిసి డ్యాన్స్ చేయాలనుకున్నాను. ఆ అవకాశం సాయిపల్లవి ఇస్తుందో లేదో తెలియదు కానీ, నాకు మాత్రం ఆ కోరిక వుందన్నారు చిరంజీవి. సాయిపల్లవి అందుకుంటే... మీతో అవకాశం నాకు అవార్డ్ లాంటిదంటూనే రీమేక్ చిత్రాలంటే తనకు భయమనీ, అందువల్లనే ఆ పాత్ర వద్దనుకున్నట్లు చెప్పేసింది.
 
ఇకపోతే తన మిత్రుడు ఆమీర్ ఖాన్, నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రం కోసం తను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చిరు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments