Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజికల్ ప్రమోషన్స్ త్వరలో ప్రారంభించనున్నసైంధవ్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (07:42 IST)
Venky-saidhev
విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, క్యారెక్టర్ లుక్స్, టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా ‘సైంధవ్’ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేశారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేశారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కౌంట్ డౌన్ పోస్టర్ లో వెంకటేష్ సెలబ్రెషన్స్ మూడ్ లో ఆనందంగా కనిపించారు. పోస్టర్ లో వెంకటేష్ సిగ్నేచర్ మూమెంట్ ఆకట్టుకుంది.
 
‘సైంధవ్’ జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ కు ఇంక 75 రోజులు వుందని తెలియజేస్తూ విడుదల చేసిన కౌంట్ డౌన్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానులని అలరిస్తోంది.
 
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 
ఈ చిత్రానికి ఎస్ మణికందన్ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments