Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ సాయిపల్లవి ఇంటి శుభకార్య... ఎవరిది?

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (16:46 IST)
హీరోయిన్ సాయిపల్లవి ఇంట శుభకార్యం జరుగనుంది. ఆమె సోదరి, సినీ నటి పూజ కన్నన్ వివాహం త్వరలో జరుగనుంది. తన స్నేహితుడు వినీత్‌ను ఆమె పెళ్లాడనున్నారు. దీంతో సాయిపల్లవి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. 
 
నటి పూజ కన్నన్‌, వినీత్‌లు గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇపుడు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరి వివాహం మరికొన్ని రోజుల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయంటూ పూజ ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 
సాయిపల్లవి సోదరిగా పూజ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలే. కోలీవుడ్‌ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఇది విడుదలైంది. పూజ నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘వినీత్‌.. నా సన్‌షైన్‌.  ఇప్పటివరకూ నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైమ్.. ఇకపై నా జీవిత భాగస్వామి’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments