నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. తెలుగు, తమిళంలోనూ రూపొందుతోంది. మత్స్యకారుల జీవితంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొంటేటి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి సముద్రంలోని యేటకు వెళ్ళిన నాగచైన్య సీన్స్ తీశారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది చిన్న గ్లింప్స్ ను నేడు విడుదుల చేశారు.
జడ్డా.. గుర్తెట్టుకో.. ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్...ఇక రాజులమ్మ జాతరే .. అంటూ పలికే డైలాగ్ తర్వాత సముద్రం నీటిలో వలవిసురుతాడు. కట్ చేస్తే, పాకిస్తాన్ బోర్డర్ దాటడంతో అక్కడి పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. మూడురంగుల జెండాను చూడగానే ఆఫీసర్.. ఏంట్రా, దేశ భక్తా. అది కూడా మీ దేశాకికే.. అంటూ వెటకారంగా అంటాడు. దాంతో చైతు.. మానుంచి వీడిపోయిన ఓముక్క.. ఆ ముక్కను ముష్టేసిన మాకెంత్తుండాలి.. తేరే పాకిస్తన్ అడ్డా మే పేట్ కే బతారహా హూ.. భారత్ మాతా కీ జై.. బుగ్గు లేపి తొండకొట్టేస్తా.. అంటూ ఆవేశంగాపలుకుతాడు. ఆ తర్వాత బుజ్జి తల్లి వచ్చేస్తున్నా గదే.. అంటూ సాయిపల్లవి షాట్ కనబడతుంది.
ఆసక్తిగా సాగిన తండేల్ గ్లింప్స్ రెండు దేశాల మధ్య జరిగే పోరాటంగా కనిపిస్తుంది. గతంలో మత్సకారులు సముద్రంలో పొరపాటున బోర్డర్ దాటితే వారిని ఖైదీలుగా భావించి చిత్ర హింసలు పెట్టేవారు. కొందరిని చంపేసేవారు. ఈ నేపథ్యంలో రాబోతున్న తండేల్ నాగచైతన్య కెరీర్ కు మంచి మార్క్ వుంటుందని నిర్మాత అల్లు అరవింద్ తెలియజేస్తున్నారు.